2022 జూలై వరకు వ్యవసాయ విశ్వవిద్యాలయంతో కొన్ని ప్రైవేట్ సంస్థలు చేసుకున్న అవగాహన ఒప్పందాలను పునః పరిశీలన జరిపిన తర్వాత ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ప్రయోజనాలకు భంగం కలిగించే విధంగా ఉన్నందున ఈ అవగాహన ఒప్పందాలను రద్దు చేయడం జరిగిందని ఉపకులపతి ప్రొఫెసర్ ఆల్థాస్ జానయ్య తెలిపారు. పిజెటిఏయుతో భాగస్వామ్యం ఉన్న ప్రైవేట్ సంస్థల ఒప్పందాలను నేడు రద్దు చేశారు. ప్రైవేట్ సంస్థలకు వ్యవసాయ విశ్వవిద్యాలయంతో ఎలాంటి సంబంధం లేదన్న విషయాన్ని విద్యార్థులు, తల్లిదండ్రులు, సామాన్య ప్రజలు గమనించాలని సూచించారు. పిజెటిఏయు ఎలాంటి ప్రైవేట్ సంస్థలతో వ్యవసాయ విద్య కోర్సుల కోసం భాగస్వామ్యంగానీ, గుర్తింపు ఇవ్వడంతో గాని సంబంధం లేదని స్పష్టం చేశారు. కొన్ని ప్రైవేటు సంస్థలు పిజెటిఏయు పేరును వాడుకొని వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా మరియు బ్రోకర్ల ద్వారా సీట్లు ఇప్పిస్తామని, అలాగే పిజెటిఏయుతో అనుబంధం ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నట్లు వ్యవసాయ విశ్వవిద్యాలయం దృష్టికి వచ్చిందని, ఈ విషయాలను నమ్మవద్దని ఆయన తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజాహిత ప్రకటన జారీ చేయడం జరిగింది.

4 Nov, 2024
