పప్పుధాన్యాలు పండించే రైతులకు తిప్పలు తప్పడం లేదు. పప్పుదినుసుల నిల్వకు తగిన వసతులు, మార్కెటింగ్ సౌకర్యాలు లేకపోవడంతో పప్పుధాన్యాలు పండించే రైతులు నష్టపోతున్నారని భారతీయ రిజర్వు బ్యాంక్ (ఆర్బీఐ) ఒక నివేదికను విడుదల చేసింది. పప్పుదినుసుల సాగులో స్వయం సమృద్ధిని సాధించేందుకు అవకాశాలున్నా కూడా ప్రభుత్వాలు తగిన కృషి చేయడం లేదు కాబట్టే ఇప్పటికి కూడా మనం దిగుమతుల మీద ఆధారపడుతున్నట్లు ఆ నివేదికలో పేర్కొంది. పంటల మార్పిడి ద్వారా పప్పుదినుసులను సాగు చేసేలా రైతులను ప్రోత్సహించాలని, గిడ్డంగులతో పాటు ఇతర నిల్వ సౌకర్యాలు కల్పించాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా మార్కెటింగ్ సదుపాయాలు ఉండాలని, సాగులో కొత్తవంగడాలను, స్వల్పకాలిక రకాలను ప్రోత్సహించాలని ఆ నివేదికలో పేర్కొంది. వీటితో పాటు అవసరమైన చర్యలు పొందుపరిచిన నివేదికలోని విషయాలను రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బిఐ) వెల్లడించింది.

10 Oct, 2024
