ఇటీవల సంభవించిన వరదల వలన పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతులకు హామీ ఇచ్చారు. వరి పంట సాగు చేసి వరదల వలన పంట నష్టపోయిన రైతులకు ప్రతి ఎకరానికి పదివేల రూపాయలు అందిస్తాము కాబట్టి రైతులు అధైర్యపడవద్దు అని ఆయన కోరారు. ఇందుకు సంబంధించి ఏలూరు సీ.ఆర్. రెడ్డి కాలేజ్ ఆడిటోరియంలో వరద బాధితులు, వరదలకు నష్టపోయిన రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించిన సందర్భంలో చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ నెల 17వ తేదీ లోపు నష్టపరిహారంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

11 Sep, 2024
