సంవత్సరానికి 6.5 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును సృష్టించి రానున్న ఐదేళ్ళలో 35 లక్షల ఎకరాలకు కొత్తగా నీరందిస్తామని తెలంగాణా నీటిపారుదల శాఖామంత్రి ఉత్తమకుమార్ రెడ్డి వెల్లడించారు. గంధమల్ల జలాశయానికి త్వరలోనే టెండర్లు పిలిచి పనులు ప్రారంభిస్తామని కూడా చెప్పారు. శ్రీశైలం ఎడమ కాల్వ ప్రాజెక్ట్ (ఎస్ఎల్బీసీ)ను మూడేళ్ళలో పూర్తి చేసి 4 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామని, డిండి, శివన్నగూడెం పూర్తి చేసి నల్లగొండ జిల్లాలోని ప్రతి ఎకరాకు నీరు అందిస్తామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.

3 Aug, 2024
