తెలంగాణ రాష్ట్రంలో సేంద్రియ సహజ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలని, ప్రకృతి వ్యవసాయ నిపుణుడు పద్మశ్రీ పురస్కార గ్రహీత సుభాష్ పాలేకర్ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావులను కోరారు. శాసనసభ ప్రాంగణంలో సీఎంను, వ్యవసాయ శాఖమంత్రిని విడివిడిగా కలిశారు. సహజ వ్యవసాయ విధానాలు, వాటిపై రైతులకు కల్పిస్తోన్న అవగాహన కార్యక్రమాల గురించి సీఎం పాలేకర్‌ని అడిగి తెలుసుకున్నారు. గో-ఆధారిత సహజ వ్యవసాయ విధానాలపై తాను రాసిన పుస్తకాన్ని పాలేకర్ సీయం రేవంత్‌రెడ్డికి అందజేశారు.

1 Aug, 2024
