ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాల దిగుబడి పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వ్యవసాయ శాఖామంత్రి అచ్చెంనాయుడు అన్నారు. ఇందుకుగాను అన్ని గ్రామాల్లో ఊరూరా పశుగ్రాస క్షేత్రాలను ప్రారంభించాలని సూచించారు. పశుగ్రాసం పెంపకంలో భాగంగా చిన్న, సన్నకారు రైతులు తమకున్న పొలంలో 25 గుంటల నుండి మూడు ఎకరాల వరకు పశుగ్రాసాన్ని పెంచేందుకు ఆర్థిక సహాయం అందిస్తామని మంత్రి వివరించారు. పశుగ్రాసాల సాగును ప్రోత్సహించేందుకుగాను రెండు సంవత్సరాల పాటు ఒక ఎకరానికి దాదాపు ఒక లక్ష రూపాయల వరకు సహాయం అందిస్తామని మంత్రి అచ్చెంనాయుడు హామీ ఇచ్చారు.

26 Jul, 2024
