ఐ.ఏ.ఎస్. అధికారులు సచివాలయంకే పరిమితం కాకుండా అవకాశం ఉన్నప్పుడు పొలాలకు వెళ్ళి రైతులతో కలిసి రైతులకు అవసరమైన సూచనలు, సలహాలు అందించాలని బుధవారం వెలగపూడి సచివాలయంలో వ్యవసాయ, అనుబంధ శాఖలు, జలవనరుల శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ఐ.ఏ.ఎస్.లను ఆదేశించారు. పాతవిధానంలోనే రైతు భాగస్వామ్యంతోనే బీమా అమలు చేయాలని, పంట కాలువలలో గుర్రపుడెక్క తొలగించి పూడిక తీయాలని, సాగునీటికి కొరత లేకుండా చూడాలని, వృధాగా పోయే గోదావరి జలాలను కృష్ణా డెల్టాకు అందించాలని, ప్రకృతి వ్యవసాయం దిశగా రైతులను నడిపించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు.

4 Jul, 2024
