గోవుల్లో వివిధ రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. అందులో ముఖ్యంగా పళ్ళ నొప్పి, విరగటం, అరగటం, మేత ఊయటం వంటి సమస్యలకు పరిష్కార మార్గాలు….

సమస్య:
- పళ్ళు కదలటం, నొప్పి, బాధ
- నోట్లో ఆహారం నిల్వ వుండిపోవటం
- మేత మేయలేకపోవటం
- నోటి వెంట చొంగ కారటం
- నెమరు వేయలేకపోవటం
- నోటి వెంట దుర్వాసన రావటం
- మేత ఉండలుగా ఊసివేయటం
- దవడ, చిగుళ్ళ వాపు
కారణాలు:
- వృద్ధాప్యము
- పళ్ళు సమానంగా లేక, హెచ్చుతగ్గులుగా పెరగటం
- పళ్ళకు దెబ్బ తగలటం
- ఖనిజ లవణ లోపం
- దంతముల ప్రక్కన మరొక దంతం పుట్టటం
- దంతాలు కదులుట
- పళ్ళ మధ్య ఆహారం కుళ్ళుట
- పళ్ళపై ఎనామిల్ పొర చెడిపోవటం
పరిష్కారాలు: పళ్ళ వెంట రక్తం కారుతుంటే, ఐస్ గడ్డ పెట్టి, రక్తం కారటం ఆపాలి.
ఆయుర్వేదం: క్రింది వాటిలో ఏదైనా ఒక విధానం.
గృహ వైద్యం:
1. యూకలిప్టస్ ఆరుల్‌తో తడిపిన దూది పన్ను పై పెట్టాలి.
2. గట్టి తెలగ పిండి తినిపించాలి.
పెరటి వైద్యం:
1. మూర్కొండాకు పసరు గానీ చిత్రమూలం వేరు పసరు గానీ నొప్పి గల పళ్ళ చిగురుకు పట్టించాలి.
2. ఉత్తరేణి మొక్కను కాల్చిన మసి 15 గ్రా||, శొంఠి 15 గ్రా||, పటిక 15 గ్రా||, ఉప్పు 15 గ్రా||, నూరి చిగుళ్ళపై రాయాలి.
ఓషధులు: మర్రి ఊడలు 100 గ్రా||, రావి చెక్క 100 గ్రా||, తొక్కి రసం తీసి, 500 గ్రా|| గట్టి తెలగ పిండి చెక్కతో కలిపి తినిపించాలి.
మూలికావైద్యం:
1. వస, కర్పూరం, ఉప్పు, శొంఠి సమపాళ్ళలో నూరి, నొప్పి గల పన్నుపై పెట్టాలి.
2. మాదీ ఫలం 15 గ్రా||, పిప్పళ్ళు 30 గ్రా||, ధనియాలు 30 గ్రా||, సైంధవ లవణం 30 గ్రా|| కలిపి నూరి, పొడిని 30 గ్రా|| బెల్లంలో కలిపి తినిపించాలి.
హోమియో: ఈ క్రింది వాటిలో ఏదైనా ఒకటి.
1. గాయాలు ఉండి, రక్తము కారుతుంటే, ఆర్నికా 200 రోజుకు 10 మాత్రలు రక్తం ఆగే దాకా తినిపించాలి.
2. బొరాక్స్ 30 లేదా మెర్క్ సాల్ 30 ఒకదాని తర్వాత మరొకటిగా, ఉదయం 10 మాత్రలు, సాయంత్రం 10 మాత్రలు తినిపించాలి.
3. క్రియోసోటమ్ 30 లేదా చెమోమిల్ల రోజుకు 5 మాత్రలు తినిపించాలి.
4. కాల్కేరియా కార్బ్ 1M మందు 5 చుక్కలు ఒకే పర్యాయం, కొద్దిపాటి దాణాలో పెట్టి తినిపించాలి.
అల్లోపతి:
1. పటిక నీళ్ళతో నోరు కడిగి, 10% బోరోగ్లిసరిన్‌ను రోజుకు రెండు సార్లు నోటిలో పూయాలి.
2. నొప్పి ఉంటే ఆక్సికామ్ వెట్ (OXYCAM VET) వంటి ఇంజక్షన్లు చేరుంచాలి.
3. బీకామ్‌ఎల్ (BEELCOM-L) వంటి ఇంజక్షన్లు చేరుంచాలి.
4. డైరోలిన్-ఎల్ బోలస్ (DIROLIN – L BLUS) వంటి మందును తినిపించాలి.
5. మినరల్ మిక్చర్ తినిపించాలి.
6. పశువైద్యనిపుణులచే, పెరుగుదలలో హెచ్చుతగ్గులున్న దంతాల పైభాగాన్ని, ఆకురారు వంటి ఒక సాధనం టూత్‌రాస్ప్‌తో అరగదీరుంచాలి.
7. కదిలిన పళ్ళను అవసరం మేరకు పశువైద్య నిపుణుని సలహా మేరకు పీకించాలి.
గమనిక: మీ దగ్గరలోని పశువైద్యుని సంప్రదించిన తరువాతనే పై అల్లోపతి వైద్య విధానాలను అనుసరించగలరని మనవి. డాక్టర్ ములగలేటి శివరామ్, ఔ.ఙ.ఐబీ., కూరాడ గ్రామం,
డాక్టర్ ములగలేటి శివరామ్, B.V.Sc.,కూరడ గ్రామం,
గుడ్లవల్లేరు మండలం, కృష్ణా జిల్లా, ఆంధ్రప్రదేశ్.

