ఢిల్లీరావు, ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ డైరెక్టర్‌
నకిలీ విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు తయారుచేసినా, విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని ఆంధ్రప్రదేశ్‌ వ్యవసాయశాఖ నూతన డైరెక్టర్‌ ఎస్‌. ఢిల్లీరావు హెచ్చరించారు. జులై 17 (బుధవారం) వ్యవసాయశాఖ కార్యాలయంలో డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మాట్లాడుతూ… రైతుల ఆదాయం పెంచే లక్ష్యంతో వ్యవసాయశాఖ పనిచేస్తుందని, పంటల సాగులో పెట్టుబడి వ్యయం తగ్గించేందుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించేలా కార్యాచరణ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. ప్రకృతి వ్యవసాయానికి మరింత ప్రోత్సాహం కల్పిస్తామని, రసాయనాల వల్ల జరుగుతున్న నష్టంపై రైతులకు అవగాహన కల్పిస్తామని అన్నారు.