ఆంధ్రప్రదేశ్లో చేపలు, రొయ్యల చెరువుల తవ్వకాలకు లెసెన్స్ తీసుకోవడం తప్పనిసరి చేస్తూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ, మత్స్యశాఖ మంత్రి అచ్చెన్నాయుడు శాసనసభలో ప్రవేశపెట్టిన బిల్లును సభ్యులు ఏకగ్రీంగా ఆమోదించారు. ప్రభుత్వం కల్పించిన విద్యుత్తు రాయితీ ఆక్వా రైతులు పొందేందుకు లైసెన్స్ తీసుకోవడం సరైన మార్గమని మంత్రి అన్నారు. గడువు తీరిన పాత లైసెన్సులను నిర్దేశించిన ఫీజుతో పాటు 50% ఆలస్యపు రుసుములు చెల్లించి పునరుద్ధరించుకోవచ్చని మంత్రి పేర్కొన్నారు. తీర ప్రాంతంలో చేపలు, రొయ్యల పెంపకం కార్యకలాపాల కాలవ్యవధి జీవితకాలం నుంచి ఐదేళ్లకు తగ్గించారు. ఆక్వా దుకాణాలకు సంబంధించిన జీవితకాలం ఏడాదికి తగ్గిస్తూ చట్ట సవరణ చేశారు.

25 Sep, 2025
