డ్రోన్ల వినియోగంపై అధికారులు దృష్టి పెట్టాలి. సాగులో సాంకేతికతను పెంచుదాము. కేంద్రమంత్రి రామ్మోహన నాయుడుతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని డ్రోన్‌ హబ్‌గా తయారు చేద్దాం అని వ్యవసాయ శాఖపై జరిగిన సమీక్ష సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాగి, సజ్జ, జొన్న తదితర చిరుధాన్య పంటలకు ఉన్న డిమాండ్‌ దృష్ట్యా వీటిసాగుకు రైతులను ప్రోత్సహించాలని అధికారులకు చెప్పారు. మరీ ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రకృతి సేద్య విధానాన్ని 50 లక్షల ఎకరాలకు విస్తరించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.