ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికలలో రైతులకు ఇచ్చిన హామీలలో భాగంగా ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేసింది. ఇందుకు సంబంధించిన బిల్లుకు అసెంబ్లీ ఏకగ్రీవ ఆమోదం తెలియచేసింది. ల్యాండ్ టైట్లింగ్ చట్టం వలన నేరస్థుల దగ్గర టెక్నాలజీ ఉంటే రికార్డులు మార్చివేయడం సులభమవుతుంది. అది ప్రమాదకరం. వారసత్వ భూములకు ప్రభుత్వం తరఫున రాజముద్ర వేసి రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వడం ఆనవాయితీ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో అన్నారు. సమగ్ర భూసర్వే కూడా తప్పుల తడకగా సాగడంతో దానిని కూడా నిలిపివేశామని, పూర్తిగా పరిశీలించాకే మళ్లీ ఆలోచిస్తామని చంద్రబాబు అన్నారు.

25 Jul, 2024
