రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్, పద్మశ్రీ పురస్కార గ్రహీత యడ్లపల్లి వేంకటేశ్వరరావు
గుంటూరు సమీపంలోని చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్ యూనివర్శిటి స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫుడ్ టెక్నాలజీ విభాగంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఫుడ్ టెక్నాలజీ మరియు ‘నాబార్డు’ సంయుక్త ఆధ్వర్యంలో ‘పోస్ట్ హార్వెస్ట్ మేనేజ్‌మెంట్ అండ్ వాల్యూ అడిషన్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్’ అనే అంశంపై రైతులకు నిర్వహించిన ఐదు రోజుల శిక్షణలో భాగంగా ఏప్రిల్ 28న కొర్నెపాడులోని రైతునేస్తం ఫౌండేషన్‌ను సందర్శించింది రైతుల బృందం. రైతునేస్తం ఫౌండేషన్‌లో వాల్యూ ఎడిషన్‌కి సంబంధించి ఏర్పాటు చేసిన యంత్రపరికరాల గురించి వివరిస్తూ విలువ జోడిరపుతోనే రైతుకు అధిక ఆదాయం అని రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్, పద్మశ్రీ పురస్కార గ్రహీత డా. యడ్లపల్లి వేంకటేశ్వరరావు అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్త టి.వి. రమణారావు పాల్గొన్నారు.

రైతునేస్తం ఫౌండేషన్‌లో సేంద్రియ పద్ధతుల్లో సాగు చేసే వివిధ రకాల కూరగాయలు, ఆకు కూరలతో పాటు సేంద్రియ సాగుకు అవసరమైన కషాయాలు, మిశ్రమాల తయారీ విధానాన్ని విపులంగా అడిగి తెలుసుకున్నారు. వీటితో పాటు కట్టెగానుగతో నూనె తీసే పద్ధతుల్ని, వానపాముల ఎరువు తయారీ విధానాన్ని, తేనేటీగల పెంపకాన్ని, పుట్టగొడుగుల పెంపకాన్ని ప్రత్యక్షంగా సందర్శించి తెలుసుకోవడంతోపాటు కూరగాయలకు విలువ జోడిరపు పద్ధతులు (ఉదాహరణకు ఎండు మిరపకాయలను కారంపొడి తయారు చేయడం, టమోటాలను పల్ప్ తయారు చేయు విధానాలను) ప్రత్యక్షంగా సందర్శించి వాటి వివరాలను, కూరగాయలకు విలువ జోడిరచడం వలన వచ్చే ఉపయోగాలను విపులంగా రైతునేస్తం సిబ్బంది ద్వారా తెలుసుకున్నారు. తమ శిక్షణలో భాగంగా రైతునేస్తం ఫౌండేషన్ సందర్శించి తమకు ఉపయోగపడే ఎన్నో విషయాలను తెలుసుకోవడంతోపాటు కొన్నింటిని ప్రత్యక్షంగా చూడడం మాకు చాలా ఆనందంగా ఉందనీ, వీటిని ప్రత్యక్షంగా చూడడం వలన వీటికి అవసరమైన నైపుణ్యాల గురించి మాకు అవగాహన వచ్చింది కాబట్టి ఈ శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత మేము తమకు అవకాశం ఉన్నంతవరకు తాము ఇలాంటి ఉపాధి అవకాశాలలో అడుగుపెట్టి వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడిరపును ఉపాధిగా మార్చుకొని ఆర్ధికంగా బలపడగలమని మాకు నమ్మకం కలిగిందని వివరిస్తూ ఈ అవకాశం కల్పించిన రైతునేస్తం ఫౌండేషన్ చైర్మన్ వై. వేంకటేశ్వరరావుకు రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు.

