తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తూంది. కానీ ఆ వ్యయాన్ని తగ్గించేందుకు రైతులు కూడా పీయం కుసుమ్ యోజన కింద సౌర విద్యుత్ మోటార్లను ఏర్పాటు చేసుకుని, సౌర పంపు సెట్లను ప్రోత్సహించాలని, రైతులు సుస్థిర అభివృద్ధిపై అధికారులు దృష్టిసారించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సూచించారు. సేంద్రియ వ్యవసాయంపై ప్రధానంగా దృష్టి సారించాలని, లేదంటే మితిమీరి వాడుతున్న రసాయనిక ఎరువుల వల్ల భూమి నిస్సారమయ్యే ప్రమాదం ఉందని హనుమకొండ కలక్టరేట్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించిన సందర్భంగా గవర్నర్ అన్నారు.
29 Aug, 2024