అర్హులై ఉండి రేషన్ కార్డు లేక, ఇతర కారణాల వలన రుణమాఫీ వర్తించని రైతుల వివరాల నమోదుకు ‘రైతు భరోసా పంట రుణమాఫీ యాప్’ ను తెలంగాణా రాష్ట్ర వ్యవసాయ శాఖ రూపొందించింది. ఈ యాప్‌ను అన్ని జిల్లాల వ్యవసాయ అధికారులు, డివిజన్, మండల అధికారులు, విస్తరణ అధికారులకు పంపించింది. వారు రుణ మాఫీ వర్తించని రైతుల ఇళ్ళకు వెళ్ళి క్షేత్రస్థాయి సమాచారం సేకరించి యాప్‌లో నమోదు చేయాలనే మార్గదర్శకాలను వ్యవసాయశాఖ జారీ చేసింది. మంగళవారం నుంచి సర్వే ద్వారా యాప్‌లో వివరాల నమోదు ప్రక్రియ ప్రారంభం కానుంది.
26 Aug, 2024