టమాట ధరలు తగ్గుతున్న నేపథ్యంలో, ధరల మద్దతు పథకం కింద టమాట రైతులని ఆదుకునేందుకు గాను ఈ రోజు నుంచి అనంతపురం మార్కెట్‌లో టమాట సేకరణ ప్రారంభించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ శాఖామంత్రి అచ్చెన్నాయుడు ప్రకటించారు. సేకరించిన టమాటాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వివిధ రైతు బజార్లలో అమ్మేలా చర్యలు తీసుకుంటామని మంత్రి అన్నారు. టమాట ధరల తగ్గుదలపై మార్కెటింగ్ శాఖ అధికారులు, జిల్లా సంయుక్త కలెక్టర్లతో సమీక్ష నిర్వహించి ఈ నిర్ణయం తీసుకున్నారు.
28 Aug, 2024